Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత : అన్నివేళలా మాస్క్ ధరించటం అసాధ్యమని బీసీసీఐ చీఫ్ గంగూలీ అన్నాడు. పంత్‌కు పాజిటివ్ రాగా దాదా ఇలా స్పందించాడు. ' అన్ని సమయాల్లో మాస్క్ ధరించటం ఫిజికల్‌గా అసాధ్యం. ఇంగ్లాండ్‌లో యూరో కప్, వింబుల్డన్ కప్‌లు చూశాం. నిబంధనలు మారిపోయాయి. ఆటగాళ్లు సెలవులో ఉన్నారు. ఎల్లవేళలా మాస్క్ ధరించటం సాధ్యం కాని పని' అని దాదా తెలిపాడు. గాయపడిన శుభ్‌మన్ గిల్‌పై స్పందిస్తూ ' ఈ విషయాల్లో నేను జోక్యం చేసుకోను. జట్టు మేనేజ్మెంట్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది' అని గంగూలీ తెలిపాడు.