Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : మూడు ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రత్యేకించి ఏ ఫార్మాట్‌కు ప్రాధాన్యత లేదని భువనేశ్వర్ అన్నాడు. ' రెడ్ బాల్ ఫార్మాట్‌పై వైట్‌బాల్ ఫార్మాట్‌కు ఏ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. టెస్టులకు ఎంపికైనా, జట్టుకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తా. అన్ని ఫార్మాట్లకు సిద్ధంగానే సన్నద్దమవుతున్నాను. రానున్న 18-20 నెలల్లో ఏం జరుగుతుందనే విషయంపై ఆలోచన చేయటం లేదు. నా బౌలింగ్ శైలిలో మరీ ఎక్కువగా మార్పులు చేయలేదు, శిక్షణా పెద్దగా మారలేదు. గాయాల నుంచి ఎలా బయటపడాలనే విషయంలోనే ఎక్కువగా కష్టపడ్డాను' అని భువనేశ్వర్ అన్నాడు. శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో భువి మీడియాతో మాట్లాడాడు.