Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టులో రెండు కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ జూన్ 23న ముగియగా.. భారత క్రికెటర్లకు బీసీసీఐ మూడు వారాల సెలవు ఇచ్చింది. ఆ సమయంలో జట్టు బస చేసిన హౌటల్‌ను వీడిన రిషబ్ పంత్ వైరస్ బారిన పడగా.. సహాయక సిబ్బంది దయానంద్ సైతం పాజిటివ్‌గా వచ్చాడు. దయానంద్‌తో సన్నిహితంగా మెలిగిన సాహా, ఈశ్వరన్ సహా బౌలింగ్ కోచ్ భరత్‌లు ఐసోలేషన్‌లో ఉన్నారు. జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పంపించటంపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. 'కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే 23 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్‌కు పంపించాం. ప్రతి ఒక్క ఆటగాడికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. ఇంగ్లాండ్‌కు మరికొందరు క్రికెటర్లను పంపించే ఆలోచన ఏంత మాత్రం లేదని' బోర్డు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. రిషబ్ పంత్ ఐసోలేషన్‌లో నేటితో పది రోజులు పూర్తి చేసుకోనున్నాడు. వరుసగా రెండు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిన వెంటనే.. డర్హమ్లోని భారత జట్టుతో అతడు చేరనున్నాడు. వార్మప్ మ్యాచుకు అందుబాటులో లేకపోయినా.. తొలి టెస్టుకు పంత్ సిద్ధంగా ఉంటాడు. వార్మప్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా వినియోగించుకునే వెసులుబాటు భారత జట్టు మేనేజ్మెంట్కు ఉంది.