Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోలో పసిడి పట్టగల రెజ్లర్
భజరంగ్ పూనియా.. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి రేసులో ముందంజలో ఉన్న రెజ్లర్. అగ్ర రెజ్లర్‌గా పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా సన్నద్ధమవుతున్నాడు. ప్రతి విభాగంలో ఇద్దరు ముగ్గురు పతకాల రేసులో ఉంటే.. భజరంగ్ పోటీపడే 65 కేజీల ఫ్రీస్టయిల్లో 12-13 మంది మెడల్ రేసులో ఉంటారు!. గత రికార్డులతో నిమిత్తం లేకుండా ఎవరు ఎవరినైనా ఓడించగల సమర్థులు తలపడే విభాగం అది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తనేంటో నిరూపించుకున్నా.. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భజరంగ్ పూనియా విశ్వ క్రీడలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ.
నవతెలంగాణ క్రీడావిభాగం
- టోక్యో ఒలింపిక్స్‌కు మానసికంగా ఎలా సన్నద్ధం అవుతున్నారు?
నా మైండ్‌సెట్ బాగుంది. పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టే.. మేము ఫిట్‌గా, వైరస్ నుంచి క్షేమంగా సిద్ధమవుతున్నాం. ఇదో సవాల్, రెజ్లింగ్‌లో ఎక్కువగా గాయాలు అవుతాయి. అది దృష్టిలో ఉంచుకుని గాయం బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. మ్యాట్‌పై శిక్షణ పొందుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
- ఇది మీ తొలి ఒలింపిక్ క్రీడలు. ఒత్తిడికి లోనవుతున్నారా?
ప్రతి మ్యాచ్‌కు ముందు ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతారు. నేను కూడా ఒత్తిడికి లోనవుతాను. కానీ నా దేశ ప్రజల అంచనాలను గుర్తుకుతెచ్చుకుంటే.. ఎంతో సానుకూల శక్తి లభిస్తుంది. నాపై దేశ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు, అందుకు తగినట్టే మెడల్ కోసం నేను కష్టపడుతున్నాను. మ్యాట్‌పై అడుగుపెట్టగానే ఒత్తిడి దూరమవుతుంది. వంద శాతం ప్రదర్శన ఇవ్వటంపై దృష్టి ఉంటుంది.
-మూడు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక భారత రెజ్లర్‌గా అదనపు ఆత్మవిశ్వాసం ఉంటుందా?
మూడు పతకాలు సాధించిన ఏకైక భారత రెజ్లర్‌గా సంతోషంగా భావిస్తాను. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్.. పోటీ ఏదైనా దేశానికి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇది పెద్ద టోర్నీ, ఇక్కడ మెడల్ నెగ్గలేనేమో అనే దృక్పథంతో ఉండను. శిక్షణలో చేసిన ప్రాక్టీస్.. మ్యాట్‌పై వంద శాతం ఇవ్వటమే నా బాధ్యత. గత విజయాలను మదిలో ఉంచుకుంటే.. మెరుగైన ప్రదర్శన చేయలేను. ఎక్కడ పోటీపడినా, అత్యుత్తమ ప్రదర్శన చేయటమే నా లక్ష్యం.
- యోగేశ్వర్ దత్ మీకు మెంటర్. ఒలింపిక్స్‌కు ముందు ఏమైనా సూచనలు పొందారా?
యోగేశ్వర్ దత్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నేను నా కోచ్‌తో ట్రైనింగ్ పొందుతున్నాను. 2016లో అతడు రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికాడు. అప్పట్నుంచి ఆయనతో పెద్దగా టచ్‌లో ఉండటం లేదు. నేను నా వ్యక్తిగత కోచ్, భారత కోచ్‌లతో శిక్షణ పొందుతున్నాను. నా బలహీనతలపై ఫోకస్‌తో కోచ్‌లతో కలిసి పని చేస్తున్నాను. 2016 తర్వాత ఏ సలహా కోసం యోగేశ్వర్ దత్‌ను సంప్రదించలేదు.
- లెగ్ డిఫెన్స్‌పై దృష్టి సారించారు, ఏమైనా పురోగతి ఉందా?
చివరగా జరిగిన టోర్నీలలో నా లెగ్ డిఫెన్స్‌లో మెరుగుదల చూశాను. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో నా ప్రత్యర్థులను నా పాదాన్ని తాకనివ్వలేదు. నా లెగ్స్ నుంచి ఎటువంటి పాయింట్లను కోల్పోలేదు. లెగ్ డిఫెన్స్‌పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యాను, దీన్ని కొనసాగిస్తాను. ఒలింపిక్స్ వంటి వేదికపై ఏ చిన్న పొరపాటుకు తావివ్వలేను. అలా చేస్తే, తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ నాలుగేండ్లకు ఓసారి జరుగుతాయి, నేను నాలుగేండ్లు ఎదురుచూడలేను. ప్రతి అవకాశం గమనంలో ఉంచుకుని శిక్షణ పొందుతున్నాను, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోను.
-జపాన్ రెజ్లర్ టకుటో ఒటోగురు చేతిలో రెండు సార్లు ఓటమి, ఓ సారి వాకోవర్ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో ఏం చేయనున్నారు?
అతడు నా ప్రణాళికల్లో ఉంటాడు, కానీ నేను ఓడిన సంగతి కాదు. అతడు నాణ్యమైన రెజ్లర్, అతడిని జయించేందుకు ఏం చేయాలనేది నా మదిలో ఉంటుంది. గతంలో అతడు నాపై నెగ్గాడనే విషయం గుర్తుపెట్టుకుంటే.. అతడు ఉత్తమ రెజ్లర్ అవుతాడు. అతడిపై ఎప్పటికీ విజయం సాధించలేను. నా ప్రత్యర్థి ఎవరనేది అప్రస్తుతం, నేను అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు కష్టపడతాను. ప్రతి ఒక్కరి బలం, బలహీనతలను మా మైండ్‌లో ఉంటాయి. ప్రతి రెజ్లర్ భిన్నమే, ఒక్కో రెజ్లర్‌కు ఒక్కో ప్రణాళిక వేసుకుంటాను.
- మీ విభాగంలో ప్రతి ఒక్క రెజ్లర్‌కు ఓ ప్రణాళికతో వెళ్లటం కష్టం కాదా?
65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం.. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం కలిగిన కేటగిరి. ఈ విభాగంలో 12-13 మంది మెడల్ రేసులో ఉంటారు. ప్రతి ఒక్కరు మరొకరిని ఓడించగల సమర్థులు. ఇతర విభాగాల్లో 2-3 రెజ్లర్లు మాత్రమే మెడల్ రేసులో ఉంటారు. కానీ 65 కేజీల విభాగంలో 12-13 మందిలో ఎవరు మెరుగ్గా రాణిస్తారో వారిదే మెడల్.
- ఒలింపిక్స్‌లో పతకం కోసం దేవుడిని ప్రార్థిస్తారా?
నేను దేవుడిని విశ్వసిస్తాను. కష్టపడేవారికే దేవుడు సహాయం చేస్తాడని నాకు తెలుసు. విజయం కోసం అందరూ ప్రార్థిస్తారు. కానీ అందుకోసం కఠోరంగా శ్రమించాలి. నాకు గాయం కాకుండా ఉండి, దేవుడి ఆశిస్సులు ఉంటే చాలని నేను కోరుకుంటాను. మెడల్ కోసం బాగా కష్టపడాలి. ఇంట్లో కూర్చుంటే ఎవరూ దేవుడే కాదు, ఎవరూ సాయం చేయరు.
- ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ల పతక అవకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు?
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెజ్లరు అందరూ మంచి నైపుణ్యం కలిగినవారు. ఒలింపిక్స్‌లో 3-4 పతకాలు సాధించగలమని నా నమ్మకం. రెజ్లింగ్ సమాఖ్య నుంచి నాలుగు పతకాలు ఆశిస్తున్నారు. ఓవరాల్‌గా టోక్యో భారత రెజ్లింగ్‌కు అత్యుత్తమం కానుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ గొప్పగా రాణించింది. అంచనాలకు భిన్నంగా చాలా విభాగాల్లో పతకాలు సాధించాం. భారత క్రీడాకారులు చాలా బాగా రాణిస్తున్నారు, టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నాను.