Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021 టీ20 ప్రపంచకప్ డ్రా విడుదల
దుబారు : సుమారు రెండేండ్ల విరామం అనంతరం భారత్, పాకిస్థాన్ ఐసీసీ టోర్నీ వేదికగా తలపడనున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ గ్రూప్ డ్రాలను శుక్రవారం విడుదల చేశారు. చివరగా 2019 వరల్డ్‌కప్‌లో పోటీపడిన భారత్, పాకిస్థాన్ అక్టోబర్ 17-నవంబర్ 14న జరిగే టీ20 ప్రపంచకప్‌లో మళ్లీ ముఖాముఖికి సిద్ధం కానున్నాయి. అర్హత రౌండ్, సూపర్12 గ్రూపు డ్రాలను శుక్రవారం ఆతిథ్య బోర్డు బీసీసీఐ, ఐసీసీ కలిసి విడుదల చేశాయి. తొలి రౌండ్లో ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. అర్హత రౌండ్ గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాలు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, న్యూ గునియా, ఓమన్‌లు ఉన్నాయి. అర్హత రౌండ్లో ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్12 దశకు చేరుకుంటాయి. సూపర్12 దశలో గ్రూప్-1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు తోడు రెండు అర్హత జట్లు ఉండనున్నాయి. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్లకు తోడు రెండు అర్హత జట్లు ఉంటాయి. అర్హత రౌండ్ మ్యాచులకు ఓమన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. సూపర్12 దశ నుంచి యుఏఈలోని దుబారు, అబుదాబి, షార్జాలు వేదిక అవనున్నాయి. 16 జట్ల మెగా టీ20 ఈవెంట్‌కు తుది షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.