Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదించిన ఐసీసీ ఏజీఎం
దుబాయ్ : మంగోలియా, స్విట్జర్లాండ్ తజకిస్థాన్‌లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్య దేశాలుగా నమోదయ్యాయి. ఆదివారం జరిగిన ఐసీసీ 78వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల చేరికతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరుకుంది. ఇందులో 94 దేశాలకు అసోసియేట్ సభ్యత్వమే ఉంది. 2007లో మంగోలియా క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఆరంభం కాగా.. 2018లో జాతీయ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా నిలిచింది. స్విస్‌లో 1817లోనే తొలి క్రికెట్ మ్యాచ్ ఆడగా.. అక్కడ 2014లో క్రికెట్ స్విట్జర్లాండ్ మొదలైంది. తజకిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ 2011లో ఆరంభమవగా.. ఆ దేశ క్రీడా శాఖ, ఒలింపిక్ సంఘంతో కలిసి క్రికెట్ అభివృద్దికి పనిచేస్తోంది. మంగోలియా, తజ కిస్థాన్లు ఆసియాలో ఐసీసీ 22, 23వ సభ్య దేశాలుగా నిలువగా.. స్విస్ యూరోప్‌లో 35వ సభ్యదేశమైంది.