Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ గ్రామంలో కేసుల మోత
టోక్యో : ఒలింపిక్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల మోత మోగుతోంది. ఆరంభ వేడుకలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో క్రీడా గ్రామంలో కోవిడ్-19 కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా ఒలింపిక్ బృందంలో నలుగురు సభ్యులు వైరస్ బారిన పడినట్టు ఆ దేశం ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, ఓ సహాయక సిబ్బంది పాజిటివ్‌గా తేలారు. మిగతా జట్టు సభ్యులు రెండుసార్లు నెగెటివ్‌గా వచ్చినట్టు.. పాజిటివ్ వచ్చినవారు ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారని దక్షిణాఫ్రికా ఒలింపిక్ టీమ్ తెలిపింది. దక్షిణాఫ్రికా సెవెన్ రగ్బీ జట్టు కోచ్‌కు సైతం కోవిడ్ సోకగా.. జట్టు సభ్యులు ఎవరూ అతడితో సన్నిహితంగా లేరని నిర్వాహకులు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు రూ సెంగ్ మిన్ కోవిడ్ బారిన పడ్డారు.