Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : అమెరికా ఒలింపిక్ బృందంలో ఇద్దరు అథ్లెట్లకు కోవిడ్-19 వైరస్ సోకింది. యువ టెన్నిస్ సంచలనం కోకో గాఫ్ కోవిడ్-19 పాజిటివ్ తేలింది. దీంతో కోకో గాఫ్ ఒలింపిక్స్‌కు దూరమైంది. వరల్డ్ నం.25 కోకో గాఫ్ సోమవారం కోవిడ్-19 పాజిటివ్‌గా తేలటంతో టోక్యో ఒలింపిక్స్‌ను నుంచి వైదొలిగింది. అమెరికా ఒలింపిక్ బృందంలో మరో జిమ్నాస్ట్ సైతం కరోనా మహమ్మారి బారిన పడింది. అమెరికన్ జిమ్నాస్ట్‌లు ప్రస్తుతం ముమ్మర సన్నద్ధతలో ఉండగా.. కోవిడ్ కేసు వెలుగు చూసింది. కోవిడ్ సోకిన జిమ్నాస్ట్ ప్రత్యామ్నాయ అథ్లెట్ అని, ఆమెకు సన్నిహితంగా ఉన్న మరో అథ్లెట్ సైతం ప్రత్యామ్నాయ అథ్లెట్ అని అమెరికా ఒలింపిక్ బృందం అధికారి తెలిపారు.