Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తోషిరో ముటో
టోక్యో: ఒలింపిక్స్‌ను రద్దుచేసే ప్రసక్తి లేదని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ తోషిరో ముటో మరోసారి స్పష్టం చేశారు. ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు కరోనా వైరస్ బారినపడుతున్నా.. ఒలింపిక్స్ ప్రధాన స్పాన్సర్స్ సభ్యులు ప్రారంభోత్సవ వేడుకల హాజరుకాకున్నా మరికొద్ది గంటల్లో ఒలింపిక్స్ ప్రారంభం కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇటీవలికాలంలో ఒలింపిక్స్ గ్రామంలో రోజు రోజుకు కరోనా వైరస్ బారినపడుతున్న వారిసంఖ్య పెరుగుతుండడంతో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రీడాభిమానులంతా ఒలింపిక్స్‌పై దృష్టి సారించారని, ఈ క్రమంలో ఒలింపిక్స్ రద్దు చేయాలని అనవసర రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. కరోనా తీవ్రతను గమనిస్తున్నామని, దీనికోసం ఐదు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తామంతా 100 శాతం క్రీడలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, గత ఏడాది జరగాల్సిన క్రీడలు కరోనా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయని, అభిమానులు లేకున్నా.. ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్‌ను పూర్తిచేస్తామన్నారు.