Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో శ్రీలంకపై అద్భుత విజయం
- వన్డే సిరీస్ 2-0తో కైవసం
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో టీమిండియా 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి గెలిచింది. 276 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా.. సూర్యకుమార్ యాదవ్(53), కృనాల్ పాండ్యా(35) కలిసి ఆరో వికెట్‌కు 44 పరుగులు జతచేశారు. వీరిద్దరి నిష్క్రమణతో భారత్ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి మరోదఫా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో భువనేశ్వర్(19నాటౌట్), దీపక్ చాహర్(69) కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జతచేసి భారత్‌కు అద్భుత విజయాన్ని సొంతం చేశారు. తొలుత పృథ్వీషా(13) ఇషన్ కిషన్(1) శిఖర్ ధవన్(29), హర్దిక్ పాండ్యా(0) ఘోరంగా విఫలమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు అవిష్కా, భానుక కలిసి 77 పరుగులు జతచేశారు. మిడిలార్డర్లో అసలంక(66), చివర్లో కరుణరత్నే(44) రాణించడంతో శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భువనేశ్వర్, చాహల్‌కు మూడేసి, చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి.
శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్కా ఫెర్నాండో (సి)కృనాల్ (బి)భువనేశ్వర్ 50, భానుక (సి)మనీష్ (బి)చాహల్ 36, రాజపక్సా (సి)ఇషన్ (బి)చాహల్ 0, ధనుంజయ (సి)ధావన్ (బి)చాహర్ 32, అసలంక (సి సబ్)దేవదత్ (బి)భువనేశ్వర్ 65, శనక (బి)చాహల్ 16, హసరంగ (బి)చాహర్ 8, కరుణరత్నే (నాటౌట్) 44, ఛమీర (సి సబ్) దేవదత్ (బి)భువనేశ్వర్ 2, సందక్కన్ (రనౌట్) ఇషన్ 0, రజిత (నాటౌట్) 1, అదనం 21. (50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 275 పరుగులు.
వికెట్ల పతనం: 1/77, 2/77, 3/124, 4/134, 5/172, 6/194, 7/244, 8/264, 9/266
బౌలింగ్: భువనేశ్వర్ 10-0-54-3, చాహర్ 8-0-53-2, హార్దిక్ 4-0-20-0, చాహల్ 10-1-50-3, కుల్దీప్ 10-0-55-0, కృనాల్ 8-37-0
ఇండియా ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి)హసరంగ 13, ధావన్ (ఎల్బి) హసరంగ 29, ఇషన్ (బి)రజిత 1, మనీష్ (రనౌట్) శనక 37, సూర్యకుమార్ (ఎల్బి) సందక్కన్ 53, హార్దిక్ (సి)ధనుంజయ (బి)శనక 0, కృనాల్ పాండ్యా (బి) హసరంగ 35, దీపక్ చాహర్ (నాటౌట్) 69, భువనేశ్వర్ (నాటౌట్) 19, అదనం 21. (49.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 277 పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/39, 3/65, 4/115, 5/116, 6/160, 7/193
బౌలింగ్: రజిత 7.1-0-53-1, ఛమీర 10-0-65-0, హసరంగ 10-0-37-3, సందక్కన్ 10-0-71-1, కరుణరత్నే 6-1-26-0, శనక 3-0-10-1, ధనుంజయ 3-0-10-0