Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోకు 24 మంది స్విమర్లు
వార్సావ్ : పోలాండ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ ఫేడరేషన్ ఫినా నిబంధనలను పట్టించుకోకుండా ఒలింపిక్స్ కోసం టోక్యో 23 మంది స్విమర్లను పంపించారు. నిబంధనల ప్రకారం వీరిలో కేవలం 17 మందిని మాత్రమే పోటీలకు అనుమతించారు. దీంతో మిగిలిన ఆరుగురు సిమ్మర్లు టోక్యో నుంచి నిరాశగా స్వదేశానికి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ పోలాండ్ సిమ్మింగ్ ఫెడరేషన్ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలనే డిమాండ్ వెళ్లువెత్తుతుంది. 2012, 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న సిమ్మర్ అలిక్జా టెక్ర్జ్ తీవ్ర విమర్శలు చేశాడు. 'ఐదు సంవత్సరాలు పాటు మరో ధ్యాస లేకుండా, తమ కుటుంబాలను త్యాగం చేసి ముఖ్యమైన క్రీడా పోటీల కోసం చిత్తశుద్ధితో శ్రమించిన వారి ప్రయత్నాల్నీ మొత్తంగా వ్యర్థమయ్యాయి' అని సోషల్ మీడియాలో తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని విమర్శించాడు. దీనిపై పోలాండ్ స్విమ్మింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు పావెల్ స్లోమినిస్కి ఒక ప్రకటన విడుదల చేస్తూ 'పరిస్థితి చాలా విచారకరం, చేదు సంఘటన' అని తెలిపారు. స్విమర్ల భావోద్వేగాలు, విమర్శలు తనకు అర్థమయ్యాయని చెప్పారు. గేమ్స్‌లో వీలైనంత మంది ఎక్కువ ఆటగాళ్లను భాగస్వామ్యం చేయాలనే కోరికతోనే 23 మంది స్విమర్లను పొరపాటుగా టోక్యోకు పంపించినట్లు పేర్కొన్నారు.