Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత విమాన ప్రయాణాలు, మెడిక్లయిం, టిఎడిఎలు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్ పర్యటనలో పాల్గొనే తమ ప్రతినిధులకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) బంఫర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ గేమ్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో తమ ఆఫీసు బేరర్లకు ఐఓఎ అందిస్తున్న సౌకర్యాలు తెలిస్తే సామాన్యులు నోరెళ్ల పెట్టాల్సిందే..! ఉచిత విమాన ప్రయాణాలు, ప్రతీ రోజూ వసతి కింద రూ 25 వేలు, ప్రతీ సభ్యునికి ఆఫిషియల్ కిట్ కోసం రూ 50 వేలు అందిస్తుంది. అలాగే ఐఓఎ అధ్యక్షులు నరేంద్ర బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహ్త టిక్కెట్ల, వసతి వ్యయాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) భరిస్తుంది. కాగా, ఐఓఎ ఈ ఖర్చులకు తోడు ఊహించని వ్యయాలకు మరికొంత బడ్జెట్ (సుమారు రూ.50 లక్షలు) ఉంచింది. వీటికి తోడు మరోవైపు లాపెల్ పిన్స్, ఫేస్‌మాస్కులు, పతాకాలు, గిఫ్ట్ ఐటెమ్స్ ఖర్చులు ఉన్నాయి. వీటిన్నటి ప్రకారం ఈ సమ్మర్ ఒలింపిక్స్‌కు రూ. 3.97 కోట్లను బడ్జెట్‌గా ఐఓఎ కేటాయించింది. అలాగే ఈ రోజుల్లో ప్రతీ ఒక్క ఇండియన్ అథ్లెట్‌కు రోజుకు 50 డాలర్లు కల్పిస్తామని ఐఓఎ గతంలోనే ప్రకటించింది.