Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : 2032 ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం టోక్యోలో జరిగిన ఐఓసి సమావేశంలో 72 మంది ప్రతినిధులు బ్రిస్బేన్‌కు ఓటు వేయడంతో ఈ నగరం 35వ విశ్వ క్రీడలను నిర్వహించే అవకాశం దక్కించుకుంది. దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఒలింపిక్స్‌ను నిర్వహించనున్న మూడో ఆస్ట్రేలియా నగరంగా బ్రిస్బేన్ నిలవనుంది. సిడ్నీలో 2000 ఒలింపిక్స్, 1956 ఒలింపిక్స్ మెల్‌బోర్న్‌లోనూ జరిగాయి. కాగా, 2032 పారాలింపిక్స్ బ్రిస్బేన్‌లోనే జరగనున్నాయి. బ్రిస్బేన్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహణపై బుధవారం మొత్తం 80 ఓటింగ్ కార్డులను పంపిణీ చేయగా.. 77 ఓట్లు చెల్లాయి. 72 ఓట్లు అనుకూలంగానూ, వ్యతిరేకంగా 5 ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఐఒసి ప్రకటించింది.
తమ దేశంలో క్రీడలను విజయవంతం చేసేందుకు ఏమేం అవసరమో తెలుసని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ అన్నారు. ఇది బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌కే కాదు.. యావత్ దేశానికే చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. బుధవారం ఓటింగ్ సెషన్లో తన కార్యాలయం నుంచి మోరీసన్ వర్చువల్‌గా మాట్లాడారు. కాగా, 2024 ఒలిపింక్స్ ప్యారిస్‌లోనూ, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లోనూ జరగనున్న సంగతి తెలిసిందే.