Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్లకు గాయం
డర్హమ్ : ఇంగ్లాండ్‌లోని భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, వర్థమాన పేసర్ అవేశ్ ఖాన్లు గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం కానున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. వాషింగ్టన్ సుందర్ వేలి గాయానికి గురి కాగా, అవేశ్ ఖాన్ చేతి వేలు విరిగింది. గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరు క్రికెటర్లు స్వదేశానికి బయల్దేరే అవకాశం ఉంది. గాయంతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. మరో ఇద్దరు గిల్ బాటలో నడువనున్నారు. 24 మందితో ఇంగ్లాండ్‌కు వెళ్లిన కోహ్లిసేనలో ఇప్పుడు 21 మందే ఉన్నారు. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పంపించటంపై సీనియర్ సెలక్షన్ కమిటీ నుంచి ఎటువంటి స్పందన లేదు.
పంత్ సిద్ధం : కోవిడ్-19 వైరస్ బారిన పడిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. జులై 8న మహమ్మారి బారిన పడిన పంత్ గురువారం డర్హమ్లోని భారత జట్టు బయో బబుల్‌లోకి ప్రవేశించాడు. పంత్, సాహా ఐసోలేషన్‌లో ఉండగా వార్మప్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.