Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఓఏ నగదు పురస్కారాలు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆకర్షణీయ నగదు పురస్కారాలు ప్రకటించింది. బంగారు పతకానికి రూ. 75 లక్షలు, రజత పతకానికి రూ. 50 లక్షలు, కాంస్య పతకానికి రూ.25 లక్షల నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ప్రతి అథ్లెట్‌కు రూ. 1 లక్ష బహుమతి ఇవ్వనుంది. టోక్యోలో అథ్లెట్లకు రోజుకు రూ.3700 (50 డాలర్లు) అదనంగా ఇవ్వనుంది. ఒలింపిక్స్‌కు అథ్లెట్లను పంపిన జాతీయ క్రీడా సమాఖ్యకు రూ. 25 లక్షలు, మిగతా సమాఖ్యలకు రూ. 15 లక్షల చొప్పున, పతకం సాధించిన క్రీడా సమాఖ్యకు అదనంగా మరో రూ. 30 లక్షలు ఐఓఏ ఇవ్వనుంది. రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు రూ.15 లక్షల చొప్పున క్రీడా వసతుల కల్పనకు కేటాయించింది.