Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, శ్రీలంక మూడో వన్డే నేడు
కొలంబో : కుర్రాళ్లు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. తొలి వన్డేలో అలవోక విజయం, రెండో వన్డేలో అద్వితీయ పోరాటంతో సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న భారత్.. నామమాత్రపు మూడో వన్డేలోనూ దుమ్మురేపాలని చూస్తోంది. సిరీస్‌పై ఆశలు కోల్పోయినా.. ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా విలువైన పాయింట్ల కోసం శ్రీలంక తపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ భారత్‌కు నామమాత్రమే కానీ శ్రీలంకకు ఎంతమాత్రం కాదు. ఆతిథ్య దేశంగా భారత్ నేరుగా 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించనుండగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో శ్రీలంక నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. నేడు భారత్‌పై విజయం సాధిస్తే ఆ జట్టుకు విలువైన పది పాయింట్లు లభించనున్నాయి. నేడు మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం.
భువనేశ్వర్ కుమార్ ఫిట్‌గా కనిపించటం లేదు. నేడు అతడి స్థానంలో నవదీప్ సైని తుది జట్టులోకి రానుండగా.. మోకాలి గాయం నుంచి కోలుకున్న సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలనుకుంటే తుది జట్టులో మార్పులు ఆశించవచ్చు. చివరగా 1997లో భారత్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం సాధించిన శ్రీలంక.. తాజా సిరీస్‌ను వైట్‌వాష్‌తో కోల్పోయే ప్రమాదంలో పడింది.