Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎట్టకేలకు 2020 విశ్వ క్రీడలు
- తొలిసారి 'టీవీ'లోనే ఒలింపిక్స్
- నేడు సాయంత్రం ఆరంభ వేడుకలు
ఏడాది నిరీక్షణకు తెర పడనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. అభిమానులు లేకుండా, ఖాళీ స్టేడియాల్లో విశ్వ క్రీడలు జరుగునుండగా.. చరిత్రలో తొలిసారి 'టెలివిజన్' ఒలింపిక్స్‌ను అభిమానులు చూడనున్నారు. కరోనా మహమ్మారి ఉదృత వ్యాప్తి భయాందోళనలతో ఒలింపిక్స్ రద్దు కోరుతూ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టినా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, టోక్యో నిర్వహణ కమిటీ ఆటలకే ఓటేశాయి.
అంకెల్లో టోక్యో ఒలింపిక్స్
పతక ఈవెంట్లు : 339
ఒలింపిక్ క్రీడలు : 33
క్రీడాంశాలు : 50
స్టేడియాలు : 42
రోజులు : 17
ఒలింపిక్స్‌లో నేటి భారత్
ఈవెంట్ అథ్లెట్ సమయంఆర్చరీ దీపిక 5.30 Aవీ ఆర్చరీ అటాను, 9.30 Aవీ ప్రవీణ్,తరుణ్‌దీప్ సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం..
నవతెలంగాణ-టోక్యో
ఆరంభ వేడుకల సందడి కనుమరుగు. ఆతిథ్య నగరంలో విశ్వ క్రీడల సంబరాలకు సెలవు. ప్రపంచ దిగ్గజ అథ్లెట్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసే అవకాశం దూరం. ఒలింపిక్ క్రీడా గ్రామంలో మునుపటి ఉత్సాహం కనుమరుగు. ఒలింపిక్ మెడల్‌ను ముద్దాడేందుకు టోక్యోకు చేరుకున్న అథ్లెట్లు.. భారీ బయో బబుల్‌లో కొత్త జీవితంలోకి ప్రవేశించారు. 2020 ఒలింపిక్స్ సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. అయినా.. అత్యుత్తమ పోడియంపై మెడల్‌ను ముద్దాడాలనే ఉత్సాహం అథ్లెట్లలో ఉరకలేస్తోంది. ఆ జోరే.. లెక్కకు మించి ఆంక్షల నడుమ టోక్యో ఒలింపిక్స్‌ను ముందుకు నడిపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాది వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్.. నేడు ఆరంభం కానున్నాయి. జులై 23న సాయంత్రం 4.30 గంటలకు ఆరంభ వేడుకులతో 2020 ఒలింపిక్స్ అధికారికంగా ఆరంభం అవుతాయి.
భారత్ నుంచి 20 మంది :
టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు భారత బృందం నుంచి 20 అథ్లెట్లు హాజరు కానున్నారు. అధికారుల ప్రాతినిథ్యంపై ఐఓసీ 'ఆరుగురు' పరిమితి విధించగా.. భారత బృందంతో ఆరుగురు అధికారులు వెంట వెళ్లనున్నారు. షట్లర్లు, షూటర్లు, ఆర్చర్లు, టెన్నిస్ ప్లేయర్లు, హాకీ ఆటగాళ్లు సహా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, జూడోకా సుశిలా దేవిలు సైతం ఆరంభ వేడుకులకు హాజరు కావటం లేదు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లు ఆరంభ వేడుకల్లో భారత పతాకధారులుగా ఎంపికయ్యారు. టేబుల్ టెన్నిస్, సెయిలింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ బృందాలు ఆరంభ వేడుకల్లో మెరువనున్నారు. శనివారం నుంచే పోటీలు ఆరంభం కానుండటంతో స్టార్ షట్లర్ పి.వి సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఆరంభ వేడుకలకు హాజరు కావటం లేదు.
పతకాల పంట పండేనా? :
లండన్ ఒలింపిక్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన భారత్.. రియో ఒలింపిక్స్‌లో రెండెంకల పతకాలను ఆశించింది. 2016లో స్టార్ అథ్లెట్లు సైతం బరిలో నిలిచారు. మెడల్ పోడియంపై భారత్ పూర్తిగా నిరాశపరిచింది. షట్లర్ పి.వి సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌లు మాత్రమే పతకాలు సాధించారు. రియో పీడకల మరిచేలా.. టోక్యోలో భారత్ పతకాల పంట పండించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ సంస్థ అంచనా ప్రకారం భారత్ 19 పతకాలు సాధించే అవకాశం ఉంది. 13 క్రీడల్లో 120 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతున్న భారత్.. పలు ఈవెంట్లలో ప్రపంచ నం.1 అథ్లెట్లను పోటీలో నిలుపుతోంది. సుమారుత 10 క్రీడల్లో భారత్ పతకాలు సాధించనుందని ప్రాథమిక అంచనా!.
కోవిడ్ సవాల్ :
కరోనా ప్రమాదం ముందున్నా.. నిర్వాహకులు క్రీడల నిర్వహణకు ముందుకెళ్తున్నారు. ఈ ఏడాది జనవరి తర్వాత బుధవారం అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. బుధవారం టోక్యో నగరంలో 1832 కొత్త కేసులు వచ్చాయి. జులై 1 నుంచి ఒలింపిక్ బృందానికి సంబంధించి 67 కేసులు వెలుగుచూశాయి. ఒలింపిక్స్‌లో హాజరవుతున్న అథ్లెట్లు, అధికారులు, ఇతర సిబ్బంది నుంచి వైరస్ స్థానికులకు వ్యాప్తి చెందకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన బయో బబుల్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.