Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్స్‌లో కోవిడ్ మహమ్మారి శతకం కొట్టింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 100 దాటేసింది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. జపాన్ జులై 22న 5387 కొత్త కేసులు నమోదు చేయగా.. టోక్యో నగరంలో కేసులు రెండు వేలకు చేరువగా ఉన్నాయి. జర్మనీ సైక్లిస్ట్ సైమన్ కోవిడ్ పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడు శనివారం జరుగనున్న రోడ్ రేసుకు దూరమయ్యాడు. జర్మనీ సైక్లింగ్ బృందంలోని మరో 12 మందికి నెగెటివ్ రాగా.. తదుపరి పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ అథ్లెట్లను 2020 ఒలింపిక్స్ గుర్తు చేసుకుంది.