Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందు జరిగిన ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో భారత ఆర్చర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరల్డ్ నం.1 దీపిక కుమారి రికర్వ్ ఉమెన్ విభాగంలో తొమ్మిదో ర్యాంక్ సాధించింది. కొరియా ఆర్చర్ ఏఎన్ శాన్ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. 663 పాయింట్లతో దీపిక 9వ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో ప్రతి ఆర్చర్‌కు 72 బాణాలు ఇస్తారు. 720 పాయింట్లు అందుబాటులో ఉంటాయి. అగ్రస్థానంలో నిలిచిన ఆర్చర్‌కు అట్టడుగున నిలిచిన ఆర్చర్‌తో తొలి రౌండ్ పోటీ ఉంటుంది. 64 మంది పోటీపడే ఈవెంట్లో తొలి రౌండ్ నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. జట్టు విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంక్ కేటాయిస్తారు. తొలి స్థానంలో నిలిచిన కొరియా ఆర్చర్‌తో దీపిక కుమారి క్వార్టర్ఫైనల్లోనే తలపడాల్సి ఉంటుంది. మెన్స్ వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో, అటాను దాసు 653 పాయింట్లతో 35వ స్థానంలో, తరుణ్‌దీప్ రారు 662 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. మిక్స్డ్ జట్టు విభాగంలో ప్రవీన్ జాదవ్‌తో కలిసి దీపిక కుమారి బరిలోకి దిగనుంది.