Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒలింపిక్స్‌లో భారత్ తొలి రోజే పతకాలు ఆశిస్తోంది. నేడు (శనివారం) షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో వర్థమాన స్టార్స్ బరిలోకి దిగుతున్నారు. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పసిడిపై కన్నేసి బరిలోకి దిగుతోంది. మీరాబాయి ఈ విభాగంలో ఫైనల్‌కు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. పసిడి పోరులో చానుకు చైనా లిఫ్టర్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. చైనా లిఫ్టర్ 205 కేజీల బరువు ఎత్తనుందనే అంచనాలు ఉండగా.. చాను ఏకంగా 210 కేజీల బరువు ఎత్తి పడేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రెండేండ్ల పాటు కుటుంబానికి దూరంగా కఠోర సాధన చేసిన మీరాబాయి చాను నేడు ఒలింపిక్ పసిడి ఆశలను సాకారం చేసుకునేందుకు బరువులు ఎత్తనుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వర్థమాన స్టార్స్ ఎలవేనిల్ వలరివన్, అపూర్వీ చండేలా పోటీలో ఉన్నారు. ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ పర్యవేక్షణలో సాధన చేసిన ఎలవేనిల్ పసిడి రేసులో ఫేవరేట్. అపూర్వీ చండేలా సైతం పలు పతకాలు సాధించింది, ఒలింపిక్స్‌లో మెడల్ ఆశిస్తోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మలు పోటీలో ఉన్నారు. కోవిడ్‌కు ముందు ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఈ ఇద్దరు మెరిశారు. తొలి రోజు భారత్ మూడు క్రీడాంశాల్లో పతక రేసులో నిలిచింది. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్లు ఎలవేనిల్, అపూర్వీలపైనే ప్రధానంగా పతక ఆశలు నెలకొన్నాయి.