Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : యువ ఆటగాళ్లు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల పటౌడీ ట్రోఫీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ సహా అవేశ్ ఖాన్లు గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ముగ్గురు ఆటగాళ్లు గాయాల పాలవటంతో సీనియర్ సెలక్షన్ కమిటీ మరో ముగ్గురిని ఇంగ్లాండ్‌కు పంపిస్తోంది. రిజర్వ్ ఆటగాడు ఈశ్వరన్ సైతం షా, సూర్యకుమార్‌లతో పాటుతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పృథ్వీ షా, సూర్యకుమార్‌లు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. చివరి రెండు టీ20ల్లో ఈ ఇద్దరు ఆడేది లేనిది బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు.