Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, శ్రీలంక రెండో టీ20 నేడు
కొలంబో : శ్రీలంక పర్యటనలో భారత్ వరుసగా రెండో సిరీస్ విజయంపై గురిపెట్టింది. తొలి టీ20లో సాధికారిక విజయం సాధించిన టీమ్ ఇండియా.. నేడే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఐపీఎల్ హీరోలతో కూడిన భారత జట్టును నిలువరించటంలో శ్రీలంక విఫలమవుతూనే ఉంది. బౌలర్లు సమిష్టిగా మెరవటంతో తొలి మ్యాచ్‌లో లంకేయులు కుప్పకూలారు. నేడూ పేస్, స్పిన్ కాంబినేషన్‌తో భారత్ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది.
అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన పృథ్వీ షా నేడు అవకాశం లభిస్తే విజృంభించేందుకు చూస్తున్నాడు. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ మంచి ఆరంభం సాధించినా.. భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సంజు శాంసన్ సహా హార్దిక్ పాండ్య బిగ్ హిట్టింగ్‌పై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. శ్రీలంక పర్యటనలో నిరాశపరుస్తున్న హార్దిక్ పాండ్య.. నేటి మ్యాచ్‌లోనైనా అలరిస్తాడేమో చూడాలి. మరోవైపు శ్రీలంక శిబిరంలో నిరుత్సాహంలో కూరుకుపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ముందుండి నడిపించే ఆటగాళ్లకు కాసింత సహకారం లభించటం లేదు. రాత్రి 8 గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రసారం..