Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిమ్నాస్టిక్స్‌లో రష్యాకు స్వర్ణం
టోక్యో : జిమ్నాస్టిక్స్ సూపర్‌స్టార్ సిమోన బైల్స్ అనూహ్యంగా మహిళల జట్టు విభాగం ఫైనల్స్ నుంచి తప్పుకుంది. సిమోన బైల్స్ గైర్హాజరీలో 2010 తర్వాత ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ జట్టు విభాగంలో అమెరికా స్వర్ణం చేజార్చుకుంది. ఫైనల్లో తొలి రౌండ్లో పోటీపడిన సిమోన.. అత్యంత ఇష్టమైన అమెనార్ వాల్ట్‌ను ప్రదర్శిం చింది. ఈ విన్యాసం బైల్స్ స్థాయిలో చేయలేదు. స్కోరు సైతం అతి తక్కువగా 13.760 మాత్రమే వచ్చింది. వాల్ట్ విన్యాసం అవగానే యుఎస్ కోచ్‌లు, ట్రైనర్లు సిమోన వద్దకు వచ్చారు. ఫిట్నెస్ సమస్యతో ఆమె వైదొలిగినట్టు భావించినా.. మానసిక ఒత్తిడి కారణంగానే ఫైనల్స్ మధ్యలో వైదొలిగినట్టు ఆమె తెలిపింది. ఃనేను ఆస్వాదించి నట్టు అనిపించలేదు. టోక్యోకు నా కోసం వచ్చినా.. ఇతరుల కోసమే కష్టపడుతు న్నాను. అది నన్ను గాయపరిచింది. అందుకు వెనకాల ఉండి ప్రోత్సహించాలని నిర్ణయించుకు న్నానుః అని బైల్స్ తెలిపింది. 169.528తో రష్యా స్వర్ణం సాధిం చగా.. 166.096తో అమెరికా సిల్వర్ గెల్చు కుంది. నేడు జరిగే వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌లో సిమోన బైల్స్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఆతిథ్య జపాన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. టెన్నిస్ స్టార్ నవొమి ఒసాక పరాజయం పాలైంది. చెక్ భామ మార్కెట ఒండ్రుసోవ 6-1, 6-4తో వరుస సెట్లలో ఒసాకను ఓడించింది.