Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాకీ : ఉదయం 6.30లకు గ్రూప్-ఏలో గ్రేట్ బ్రిటన్‌తో భారత్ ఢ (మహిళలు).
బ్యాడ్మింటన్ : గ్రూప్ దశలో హాంగ్‌కాంగ్ షట్లర్‌తో సింధు మ్యాచ్. ఉదయం 7.30 గంటలకు. మెన్స్ సింగిల్స్‌లో బి.సాయిప్రణీత్ నెదర్లాండ్ షట్లర్‌తో ఢ, మధ్యాహ్నాం 2.30 గంటలకు.
ఆర్చరీ : ఉదయం 7.31 నుంచి మెన్స్ వ్యక్తిగత విభాగం (తరుణ్‌దీప్ రారు, ప్రవీణ్ జాదవ్) ఎలిమినేషన్ రౌండ్. మధ్యాహ్నాం 2.14 నుంచి మహిళల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్ (దీపిక కుమారి).
రోయింగ్ : ఉదయం 8 నుంచి మెన్స్ రోయింగ్ డబుల్ స్కల్ సెమీస్ (అర్జున్, అరవింద్)
సెయిలింగ్ : ఉదయం 8.35లకు 49ఈఆర్ మెన్స్ వ్యక్తిగత ఈవెంట్ ఎలిమినేషన్ (గణపతి, వరుణ్)
బాక్సింగ్ : మహిళల 75 కేజీల విభాగంలో పూజ రాణి తొలి రౌండ్. మధ్యాహ్నాం 2.33 గంటలకు.
- బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ గొప్ప విజయం సాధించినా.. నాకౌట్ దశకు చేరుకోలేదు. బ్రిటన్ జోడీపై 21-17, 21-19తో చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెగ్గారు. గ్రూప్‌లో ఇండోనేషియా, చైనీస్ తైపీ, భారత్ జోడీలు రెండు విజయాలతో సమవుజ్జీలుగా నిలువగా.. సెట్ల అంతరం ప్రకారం భారత్‌కు నాకౌట్ స్థానం దక్కలేదు.
- మెన్స్ హాకీ జట్టు గొప్పగా పుంజుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని మరిపించే విజయం సాధించింది. స్పెయిన్‌తో గ్రూప్ మ్యాచ్‌లో 3-0తో మెరిసింది. సిమ్రన్‌జిత్ సింగ్ (14), రూపిందర్ సింగ్ (15, 51) గోల్స్ కొట్టారు.
- టేబుల్ టెన్నిస్ దిగ్గజం లాంగ్ మాతో శరత్ కమల్ పోరాడి ఓడాడు. మూడో రౌండ్లో 7-11, 11-8, 11-13, 4-11, 4-11తో చైనా అథ్లెట్ చేతిలో ఓటమి చెందాడు.
- సెయిలింగ్ (లేజర్)లో వి.శరవణన్ ఆరో రేసులో 22వ స్థానంలో, ఐదో రేసులో 25వ స్థానంలో నిలిచాడు. 49ఈఆర్‌లో భారత్ 18వ స్థానంలో నిలిచింది.
టోక్యో పతకాల పట్టిక
దేశం ప ర కా మొత్తం
1 జపాన్ 10 3 5 18
2 అమెరికా 9 8 8 25
3 చైనా 9 5 7 21
4 రష్యా 7 7 4 18
39 భారత్ 0 1 0 01
గమనిక : పసిడి, రజతం, కాంస్యం