Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, శ్రీలంక రెండో టీ20 వాయిదా
కొలంబో : భారత క్రికెట్ డ్రెస్సింగ్‌రూమ్‌లో కరోనా వైరస్ కలకలం. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య మహమ్మారి బారిన పడినట్టు బీసీసీఐ మీడియా ప్రకటనలో వెల్లడించింది. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8 మంది ఆటగాళ్లు, సిబ్బంది ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. నేడు ఉదయం ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో అందరూ నెగెటివ్‌గా వస్తేనే.. రెండో టీ20 జరుగనుంది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సిన రెండో టీ20 కరోనా కేసుతో ఓ రోజు వాయిదా పడింది. మూడో టీ20 యథావిధిగా గురువారం నిర్వహించనున్నారు. భారత్, శ్రీలంక ఆటగాళ్లు అందరూ కోవిడ్ పరీక్షలో నెగెటివ్‌గా వస్తేనే సిరీస్‌కు ముందుకు సాగనుంది.