Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణె : భారత తొలి తరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, దిగ్గజ షట్లర్, మాజీ ప్రపంచ నం.3 నందు నాటేకర్ ఇకలేరు. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించిన లెజెండ్ బుధవారం కన్నుమూశారు. 88 ఏండ్ల నందు నాటేకర్ వృద్దాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. 1956లో మలేషియా టైటిల్ సాధించిన నందు.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ ట్రోఫీ అందించారు. 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సొంతం చేసుకున్నారు. నందు నాటేకర్ ఆరుసార్లు జ ఆతీయ చాంపియన్‌గా నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నం.3గా నిలిచాడు. 1959-63 మధ్య భారత్‌కు థామస్ కప్ ప్రాతినిథ్యం వహించిన నందు 16 సింగిల్స్ మ్యాచుల్లో 12 నెగ్గాడు. 16 డబుల్స్ మ్యాచుల్లో ఎనిమిదింట విజయాలు నమోదు చేశాడు. 1954 ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ఫైనల్స్కు చేరుకుని చరిత్ర సృష్టించారు!. 1959, 1961, 1963 థామస్ కప్‌లో భారత్‌కు నాయకత్వం వహించారు. 1961లో నందు అర్జున అవార్డు అందుకున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం మృతి పట్ల ప్రధాని నరెంద్ర మోడీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ కోచ్ విమల్ కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు.