Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5-3తో జపాన్‌పై భారత్ గెలుపు
- ఎట్టకేలకు అమ్మాయిలకు తొలి విజయం
నవతెలంగాణ-టోక్యో
క్వార్టరఫైనల్స్కు ముందు భారత హాకీ జట్టు అదరగొట్టింది. గ్రూప్ దశలో తొలిసారి గోల్స్ వర్షం కురిపించింది. ఆతిథ్య జపాన్ను చిత్తు చేసిన మన్‌ప్రీత్ సింగ్ సేన గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాపై అదిరే విజయంతో క్వార్టర్ట్ బెర్త్ ఖాయం చేసుకున్న మెన్స్ హాకీ జట్టు.. జపాన్‌పై స్వేచ్ఛగా దాడి చేసింది. నాలుగు క్వార్టర్లలోనూ గోల్స్ కొట్టింది. 5-3తో మెరుపు విజయం నమోదు చేసింది. శంషిర్ సింగ్ 13వ నిమిషంలో గోల్ కొట్టి తొలి క్వార్టర్‌లోనే 1-0 ఆధిక్యం అందించాడు. గుర్జంత్ సింగ్ 17వ నిమిషంలో, 56వ నిమిషంలో రెండు గోల్స్‌తో విజృంభించాడు. హర్మన్‌ప్రీత్ సింగ్ 51వ నిమిషంలో, నీలకంఠ శర్మ 34వ నిమిషంలో గోల్స్ నమోదు చేశారు. జపాన్ ఆటగాళ్లు సైతం మూడు గోల్స్ కొట్టినా.. మ్యాచ్ ఆసాంతం వెనుకంజలోనే కొనసాగారు. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన రాణి రాంపాల్ బృందం.. నాలుగో మ్యాచ్‌లో పుంజుకుంది. ఐర్లాండ్‌పై 1-0తో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. 14 పెనాల్టీ కార్నర్లు లభించినా.. గోల్స్‌గా మలచటంలో అమ్మాయిలు దారుణంగా విఫలమయ్యారు. నవనీత్ కౌర్ 57వ నిమిషంలో గోల్ కొట్టి భారత్‌ను గెలుపు పథాన నడిపించింది.
రేసులో ప్చ్ : అథ్లెటిక్స్ పోటీల ఆరంభమైన తొలి రోజే భారత్‌కు నిరుత్సాహం తీసుకొచ్చింది. మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్ సెమీస్‌కు చేరుకోవటంలో విఫలమైంది. హీట్ 5లో పోటీపడిన ద్యుతీ 11.54 సెకండ్లలో రేసును ముగించి, హీట్‌లో ఏడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌ను సైతం అందుకోలేని ద్యుతీ తొలి రౌండ్ నుంచే నిష్క్ర మించింది. మిక్స్డ్ జట్టు 4 ఞ 400 రిలే రేసులోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. 3:19.93 సెకండ్లలో రేసును పూర్తి చేసిన భారత్ హీట్స్‌లో చివరి స్థానంలో నిలిచింది. అనాస్ తొలి 100 మీటర్లను మెరుగ్గా ఆరంభించినా.. ఆ తర్వాత వెనుకంజ వేశారు.
దీపిక ఔట్ : భర్త అటాను దాసు ఒలింపిక్ చాంపియన్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకోగా.. అదే స్ఫూర్తితో సెమీస్ బెర్త్‌పై కన్నేసిన దీపిక కుమారి విఫలమైంది. దక్షిణ కొరియా ఆర్చర్‌కు సెమీస్ బెర్త్‌ను కోల్పోయింది. ప్రీ క్వార్టర్స్‌లో రష్యా ఆర్చర్‌ను షూట్ ఆఫ్‌లో ఓడించిన దీపిక కుమారి క్వార్టర్స్‌లో అంచనాలు పెంచింది. 28-25, 26-27, 28-27, 26-26, 25-28తో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలువగా.. షూట్ ఆఫ్‌లో దీపిక 10 స్కోరు చేసింది. రష్యా ఆర్చర్ సెనియా 7 స్కోరు చేసి నిష్క్రమించింది. కీలక క్వార్టర్ఫైనల్లో కొరియా ఆర్చర్ అన్ సాన్ చేతిలో దీపిక 0-6తో ఓటమి చెందింది. 27-30, 24-26, 24-26తో నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
తుపాకి తుస్సు : షూటింగ్లో పతక నైరాశ్యం కొనసాగుతోంది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, రాహిలు ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ప్రిసిషన్ రౌండ్లో 292 స్కోరు చేసిన మను.. ర్యాపిడ్‌లో 96, 97, 97తో 290 వద్ద ఆగిపోయింది. రాహి 96, 94, 96తో 286 మాత్రమే చేసింది. ఓవరాల్‌గా 582తో మను భాకర్, 573తో రాహిలు వరుసగా 15, 32వ స్థానాల్లో నిలిచారు.