Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ప్రజల హృదయాలను తడిపేసే సంఘటన ఇది. టోక్యో ఒలింపిక్స్ మెన్స్ హై జంప్ ఫైనల్స్. తంబెరి (ఇటలీ), బార్షిమ్ (ఖతార్) పసిడి రేసులో 2.37 మీటర్లతో సమవుజ్జీలుగా ఉన్నారు. ఒలింపిక్ రికార్డు 2.39 మీటర్ల ప్రయత్నంలో ఇద్దరూ మూడుసార్లు విఫల మయ్యారు. జంప్ ఆఫ్‌తో విన్నర్‌ను తేల్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. 'మేము ఇద్దరం పసిడి పొందవచ్చా? అధికారిని అడిగాడు బర్షిమ్. అది సాధ్యమే అధికారి సమాధానం. ఇక అంతే.. బర్షిమ్కు హ్యాండ్కిక్ ఇచ్చిన తంబెరి అతడిని హత్తుకున్నాడు. ఇద్దరు అథ్లెట్ల పసిడి ఆనందంతో క్రీడా ప్రపంచం కొత్త అనుభూతిని పొందింది. ' నేను పసిడికి అర్హుడిననే విషయం నాకు తెలుసు. అదే సమయంలో అతడూ పసిడి అర్హుడనే విషయం నాకు తెలుసు. యువ తరానికి సందేశాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని బార్షిమ్ తెలిపాడు. ఈ ఇద్దరు పసిడి పంచుకునే సన్నివేశం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ సన్నివేశంగా నెటిజన్లు దీన్ని అభివర్ణిస్తున్నారు.