Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటగాళ్ల వేలం నిర్వహించిన చారు శర్మ
నవతెలంగాణ, హైదరాబాద్ : 'దేశంలో ఎన్నడూ లేని విధంగా గోల్ఫ్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇది మంచి పరిణామమని' ప్రముఖ వ్యాఖ్యాత చారు శర్మ అన్నారు. తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టిఎన్జీఎల్) ఆరంభ సీజన్ అక్టోబర్ 12 నుంచి ఆరంభం కానుండగా.. 16 ప్రాంఛైజీలు పోటీపడిన ఆటగాళ్ల వేలంను చారు శర్మ నిర్వహించారు. 200 మంది గోల్ఫర్లు పోటీపడనున్న ఈ లీగ్ రెండు దశల్లో ఎనిమిది రౌండ్లలో 28 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హెచ్‌జీసీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, టిపీజీఎల్ టైటిల్ స్పాన్సర్ శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ డా. మాహె తదితరులు పాల్గొన్నారు.