Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన శాట్స్
నవతెలంగాణ, హైదరాబాద్ : ఆస్ట్రో టర్ఫ్, పచ్చికతో కూడిన ఫుట్‌బాల్ అకాడమీ, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ సహా బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, జూడో, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్ అకాడమీలతో కూడిన బహుళ ప్రయోజనక ఇండోర్ స్టేడియం, అధునాతన ఈత కొలను, బాల బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు..ఇలా ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ హబ్ గజ్వేెల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ మేరకు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం తెలిపారు. జులై 23, 28న సిద్దిపేట జిల్లా గజ్వేెల్లో పర్యటించిన శాట్స్ చైర్మన్, ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో రెండు దఫాలు సమావేశమయ్యారు. 15 ఎకరాల సువిశాల మినీ క్రీడా గ్రామం నిర్మిస్తే.. వర్థమాన క్రీడాకారులు, యువతకు మేలు జరుగుతుందని జిల్లా మంత్రి టి. హరీశ్‌రావు సూచన మేరకు శాట్స్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు.