Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి ఒలింపిక్ సెమీస్‌లోకి ప్రవేశం
భారత హాకీ తిరిగి స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నంత సంతోషం. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసి, నాకౌట్ అవకాశాలు సంక్లిష్టం చేసు కున్న భారత మహిళల హాకీ జట్టు.. ఏకంగా చరిత్ర సృష్టించింది. క్వార్టర్ఫైనల్లో ఆస్ట్రేలి యాను 1-0తో ఓడించి తొలిసారి ఒలింపిక్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గుర్జీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు గెలుపు గోల్ అందించింది. ఆస్ట్రేలియా 14 గోల్ ప్రయత్నాలకు అడ్డుగోడగా నిలిచిన గోల్‌కీపర్ సవిత విశేష ప్రదర్శన చేసింది. 1980, 2016 తర్వాత మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత మహిళల జట్టు.. బుధవారం వరల్డ్ నం.5 అర్జెంటీనాతో పసిడి పోరులో బెర్త్ కోసం పోటీపడనుంది.