Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్‌లో నిలిచి జావెలిన్ ఫైనల్ అర్హత
జావెలిన్ త్రో పురుషుల విభాగం స్వర్ణ పతకంపై నీరజ్ చోప్రా గురిపెట్టాడు. బుధవారం జరిగిన గ్రూప్-ఏ పోటీలో నీరజ్ అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక గ్రూప్-బిలో ఉన్న శివ్‌పాల్ సింగ్ 12వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. గ్రూప్-ఏలో మొత్తం 16మంది త్రోయర్స్లో ఉత్తమ త్రో వేసిన ఏడుగురు ఫైనల్లోకి ప్రవేశించారు. నీరజ్ తొలి ప్రయత్నంలోనే 86.85మీ. జావెలిన్‌ను విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక వెట్టెర్(జర్మనీ) 85.64మీ., ఎటెలటలో(ఫిన్లాండ్) 84.50మీ. టాప్-3లో నిలిచారు. ఇక గ్రూప్-బిలో 16మంది త్రోయర్స్లో పాకిస్తాన్‌కు చెందిన నదీమ్ 85.16మీ. అగ్రస్థానంలో ఉండగా.. వాడ్లెరిచ్(చెక్ రిపబ్లిక్) 84.93మీ., వేబర్(జర్మనీ) 84.41మీ. టాప్-3లో నిలిచారు. ఇదే గ్రూప్‌లో ఉన్న శివ్‌పాల్ సింగ్ 76.40మీ. ఉత్తమంతో 12వ స్థానానికే పరిమితమై ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఫైనల్స్ పోటీ శనివారం(7న) జరగనుంది. ఇక మహిళల జావెలిన్‌లో అన్నురాణి 54.04మీ. విసిరి నిరాశపరిచింది.