Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌కు భారత్!
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా చరిత్ర సష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై రవికుమార్ విక్టరీ బైఫాల్ కింద గెలుపొందాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టు కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్ ఫైనల్ చేరడంతో భారత్ ఖాతాలో కనీసం రజతం ఖాయమైంది. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ నిలవనున్నాడు.
ఇంతకముందు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే, యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్ కుమార్ 2012లో లండన్ ఒలిపింక్స్‌లో ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్ దహియా నిలిచాడు. దీంతో 9 ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో భారత్ ఫైనల్‌కి చేరింది.