Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ క్రీడాకారిణి వందనపై కుల వివక్ష వ్యాఖ్యలు
- దళితుల వల్లే హాకీలో ఓటమని ఎగతాళి
- స్పందించని ప్రభుత్వం, సోషల్ మీడియా
డెహ్రాడూన్ : ఇంగ్లాండ్, ఇటలీ యూరో కప్ ఫైనల్. ఆతిథ్య ఇంగ్లాండ్ అనూహ్య ఓటమితో ఆ జట్టులోని నల్లజాతీయులైన ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ భారత సోషల్ మీడియా ఉపన్యాసాలు ఇచ్చింది. జాతి వివక్ష తగదని నీతి సూక్తులు గుర్తుచేసింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ భారత్, అర్జెంటీనా సెమీఫైనల్. భారత జట్టు సెమీస్లో పోరాడి ఓడింది. భారత్ ఓటమికి జట్టులో దళితులు ఆడటమే కారణమని హాకీ క్రీడాకారిణి వందన కతరియపై కుల వివక్ష వ్యాఖ్యలు. భారత్ పరాజయాన్ని ఆమె ఇంటి ముందు బాణాసంచాతో సంబరాలు జరుపుకుని వందన, ఆమె కుటుంబ సభ్యులపై కుల వివక్ష వ్యాఖ్యలు చేశారు. హాకీ జట్టులో దళితులు ఉండటంతోనే ఓటమి ఎదురైందని నినాదాలు చేశారు. వందన కుటుంబసభ్యులతో వాగ్వివాదానికి దిగారు. ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వందనపై కుల వివక్ష దుమారం రేగుతున్నా బీజేపీ పాలనలోని ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. జాతి వివక్షపై ఉవ్వెత్తున ఎగిసిపడే సోషల్ మీడియా సమాజం స్వదేశంలో కుల వివక్షపై నోరు విప్పటం లేదు. ఇదీ భారత్లో కు(ఒ)లంపిక్స్. ఇదిలా ఉండగా వందన, ఆమె కుటుంబంపై కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తుల్లో హరిద్వార్ జిల్లాలోని రోస్నాబాద్కు చెందిన ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి మహిళా హాకీ క్రీడాకారిణిగా వందన చరిత్ర సృష్టించింది.