Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల వివక్ష వ్యాఖ్యలపై వందన
టోక్యో : భారత జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవటంలో ఆమెది ముఖ్య పాత్ర. విశ్వ క్రీడల్లో హాకీ ఇండియా నాలుగో అత్యుత్తమ జట్టుగా నిలువటంలో ఆమె కృషి అసమానం. నాలుగు మ్యాచుల్లో ఐదు గోల్స్ కొట్టి భారత్‌ను 2013 జూనియర్ వరల్డ్‌కప్‌లో కాంస్య పతకం అందించి... టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో అద్భుత ప్రదర్శనతో అసమాన విజయం దిశగా జట్టును నడిపించింది. జాతీయ జట్టు తరఫున 200కు పైగా మ్యాచులు ఆడిన అనుభవం, తండ్రి తుది శ్వాస విడిచినా దేశం కోసం హాకీ ఆడిన వీరోచిత క్రీడాకారిణి. ఆమె వందన కతరియ. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో చరిత్ర సృష్టించిన వందన కతరియ కుటుంబంపై కుల వివక్ష వ్యాఖ్యలు కాంస్య పతక మ్యాచ్‌కు ముందు కలవరానికి గురిచేశాయి. హాకీ జట్టులో దళితులు ఉండటం కారణంగానే సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి ఎదురైందని వందన ఇంటి బయట బాణాసంచా కాల్చుతూ, సంబరాలు చేసుకుంటూ కుల పేరుతో దూషణకు పాల్పడిన సంగతి తెలిసిందే. స్వదేశంలో కుటుంబ సభ్యులు కుల వివక్ష వ్యాఖ్యలతో కుంగిపోతున్న సమయంలో.. టోక్యోలో వందన భారత్ కోసం హాకీ స్టిక్ పట్టుకుంది. బ్రిటన్‌పై అసమాన ఫీల్డ్ గోల్‌తో కుల దురహంకారు లకు గోల్‌తోనే గొట్టి చెంప ఛెళ్లుమనిపించింది.
'మేము దేశం తరఫున ఆడుతున్నాం. ఏదైతే జరిగిందో, అది జరిగి ఉండాల్సింది కాదు. ఇలా జరిగి ఉండకూడదని నా అకాంక్ష. ప్రజలు తిరిగి తమ దృష్టిని హాకీ క్రీడలపై నిలపాలని కోరుకుంటున్నాను. జట్టులో నా కంటే యువ క్రీడాకారిణీలు ఉన్నారు. మేము అంతా ఓ జట్టుగా దేశాని ప్రాతినిథ్యం వహిస్తున్నాము. అందరం కలిసి ఐక్యంగానే ఉండాలి. ఒలింపిక్స్‌లో ఆ స్థాయికి చేరుకునేందుకు జట్టు ఎంతగానో శ్రమించింది. మా ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నాను. ప్రతి మ్యాచ్‌కు మేము పురోగతి సాధించాం' అని గ్రేట్ బ్రిటన్‌తో కాంస్య పతక మ్యాచ్ అనంతరం వందన తెలిపింది.