Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో భజరంగ్ పరాజయం
- నేడు కాంస్యం కోసం కుస్తీ
నవతెలంగాణ-టోక్యో
వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిపెట్టిన రెజ్లింగ్‌లో పసిడి ఆశలు రేపిన స్టార్ మల్లయోధుడు భజరంగ్ పూనియా నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం సెమీఫైనల్లో రెండో సీడ్ భజరంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ హాజి అలియేవ్ (అజర్బైజాన్) భజరంగ్పై సాధికారిక విజయం నమోదు చేశాడు. మ్యాట్‌పై తొలి నిమిషంలో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలిచారు. భజరంగ్ పూనియా పాయింట్లు సాధించేందుకు ప్రత్యర్థిపై పట్టు సాధిస్తున్నాడుకునే క్రమంలో.. హాజీ మెరుపు దాడి చేశాడు. భజరంగ్ పూనియాకు చిక్కినట్టే చిక్కి.. తిరిగి అతడినే కంద పడేశాడు. రెండు కాళ్లు ఒడిసిపట్టుకుని భజరంగ్‌ను మెలికలు తిప్పేశాడు. చివరి నిమిషంలో భజరంగ్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. బలవంతుడై హాజీ లొంగలేదు. 12-5తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. పసిడి పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఓడిన భజరంగ్ పూనియా నేడు కాంస్య పతక పోరులో రెపిచేజ్ రెజ్లర్లతో పోటీపడనున్నాడు. అంతకముందు క్వార్టర్ఫైనల్లో భజరంగ్ పూనియా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇరాన్ రెజ్లర్ మోర్తెజాను పిన్‌డౌన్ (ఫాల్) చేసి సూపర్ విజయం ఖాతాలో వేసుకున్నాడు. తొలి పోరులో కిర్జికిస్తాన్ రెజ్లర్‌తో 3-3తో సమవుజ్జీగా నిలిచినా.. తొలి రౌండ్లో టేక్‌డౌన్‌తో రెండు పాయింట్లు సాధించిన భజరంగ్ పూనియా తర్వాతి రౌండ్‌కు ముందంజ వేశాడు. రవి కుమార్ దహియా రజత పతకం సాధించటంతో.. రెజ్లింగ్‌లో భారత్‌కు కనీసం మరో సిల్వర్ మెడల్ ఖాయమనే ఆశలు భజరంగ్ పరాజయంతో ఆవిరైపోయాయి. మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్లో సీమా బిస్లా సైతం ఓటమి చెందింది. తొలి రౌండ్లోనే ట్యూనిషియా రెజ్లర్ చేతిలో 1-3తో కంగుతింది. సారా క్వార్టర్స్‌లోనే ఓడిపోటంతో సీమా బిస్లా రెపిచేజ్ అవకాశాలకు తెరపడింది.
టోక్యో పతకాల పట్టిక
దేశం ప ర కా మొత్తం
1 చైనా 36 26 17 79
2 అమెరికా 31 36 31 98
3 జపాన్ 24 11 16 51
4 గ్రేట్ బ్రిటన్ 18 20 20 58
66 భారత్ 0 2 3 05
గమనిక : పసిడి, రజతం, కాంస్యం