Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాకీ కాంస్య పతక పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రేట్ బ్రిటన్ 4-3తో భారత్ విజయం సాధించింది. ప్రథమార్థం వరకు 3-2తో ఆధిక్యంలో కొనసాగిన రాణి రాంపాల్సేన.. ద్వితీయార్థంలో గొప్ప ప్రదర్శన చేసినా గ్రేట్ బ్రిటన్ పైచేయి సాధించింది. అసమాన ప్రదర్శనతో మెరిసిన అమ్మాయిలు చివరి వరకు కాంస్యం కోసం పోరాటం చేశారు. తొలిసారి ఒలింపిక్ సెమీఫైనల్లోకి చేరుకుని చరిత్ర సృష్టించిన అమ్మాయిలు టోక్యోలో అద్భుతమే చేశారని చెప్పాలి. ఓటమితో హృదయాలు తడవగా, అమ్మాయిల కండ్లు జలపాతాలు అయిపోయాయి. ప్రధాని మోడీ ఫోన్ చేసి హాకీ అమ్మాయిలను ఓదార్చి, అభినందనలు తెలిపారు.
ఒలింపిక్ పతకం కోసం అసమాన ప్రదర్శన చేసిన అమ్మాయిలు మీరు ఓడిపోలేదు. భారత్‌లో కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు. హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు లక్షలాది మంది చిన్నారుల్లో ప్రేరణ నిలిపారు. రాణి రాంపాల్ సేన.. వందనం!