Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిస్ ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదం
టోక్యో : 2020 ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఈవెంట్ వెయిట్‌లిఫ్టింగ్. 21 ఏండ్ల విరామానికి ముగింపు పలుకుతూ మీరాబాయి చాను మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. స్వర్ణ పతక విజేత చైనా లిఫ్టర్‌తో పోటీగా నిలిచిన మీరా.. పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం దిశగా కృషి చేయనున్నట్టు తెలిపింది. అయితే, మీరాబాయి సహా భారతీయుల వెయిట్‌లిఫ్టింగ్ పసిడి కల పారిస్‌లో సాకారమయ్యేలా కనిపించటం లేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్‌పై ఐఓసీ సస్పెన్షన్ విధించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఒలింపిక్ చార్టర్ నుంచి ఓ క్రీడాంశాన్ని తొలగించేందుకు ఒలింపిక్ సెషన్ అనుమతి అవసరం లేదని, ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం సరిపోతుందని ఆదివారం ఐఓసీ తీర్మానం చేసింది. ఒలింపిక్ నియమాలు, మౌళిక సూత్రాలకు విరుద్ధంగా నడుస్తున్న వెయిట్‌లిఫ్టంగ్ సమాఖ్యకు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా, ఆ సమాఖ్య దారికి రాకపోవటంతో 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ను తప్పించే ప్రమాదం కనిపిస్తోంది.