Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి, ప్రధానితో అథ్లెట్ల ఆత్మీయ భేటీ
న్యూఢిల్లీ : టోక్యో 2020 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లు ఈ ఏడాది భారత స్వాతంత్య్ర వేడుకలకు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) ఏర్పాట్లు చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 120 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఏడుగురు అథ్లెట్లు పతకాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల అనంతరం అశోక హౌటల్లో బస చేయనున్న అథ్లెట్లు స్వాంతంత్య్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరుడిని కలువనున్నారు. ఆగస్టు 16న ప్రధాని నివాసంలో నరెంద్ర మోడీతో ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సారు తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది.