Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్మాన సభలో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ : ' ఏదో ప్రత్యేకమైనదే సాధించాననే విషయం నాకు తెలుసు. నిజానికి, ఆ త్రో నా వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన చేశానని అనుకున్నా. నిజంగా ఆ త్రో బాగా వెళ్లింది. పసిడి నెగ్గిన తర్వాత రోజు నా శరీరం అంతా నొప్పులు. పసిడి విజయానికి అర్హమైన నొప్పి అది. ఈ స్వర్ణ పతకం దేశం మొత్తానిది. ప్రత్యర్థి ఎవరైనా ఎంతమాత్రం భయపడకూదని అనుకున్నా. అదే దృక్పథంతో ఫైనల్లో విసిరాను, ఇలా పసిడితో మీ ముందుకొచ్చాను' అని టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో చాంపియన్, భారత క్రీడా రంగ నయా సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా అన్నాడు. టోక్యో నుంచి సోమవారం స్వదేశానికి చేరుకున్న భారత ఒలింపిక్ బృందానికి విమానాశ్రయంలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) డైరెక్టర్, అథ్టెటిక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సహా ఇతర ఉన్నతాధికారులు అథ్లెట్లకు స్వాగతం పలికారు. అభిమానులు భారత స్పోర్ట్స్ హీరోలకు మరుపురాని స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అశోక హౌటల్‌కు చేరుకున్న అథ్లెట్లకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సన్మాన సభ ఏర్పాటు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజుజులు ఘనంగా సన్మానించారు. మెన్స్, ఉమెన్స్ హాకీ జట్లు కేక్ కట్ చారిత్రక విజయాన్ని వేడుక చేసుకున్నాయి.