Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభరు శర్మకు అండర్-19 బాధ్యతలు
బెంగళూర్ : భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రదర్శనలో విప్లవాత్మక మార్పులకు ఆద్యుడు అభరు శర్మ.. అమ్మాయిల జట్టుతో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లటం లేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత మహిళల క్రికెట్ జట్టు బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తోంది. జాతీయ జట్టు బయో సెక్యూర్ బబుల్‌లోకి ఫీల్డింగ్ కోచ్ అభరు శర్మ సహా ట్రైనర్ నరేశ్ రామ్‌దాస్‌లు ప్రవేశించలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో హర్లీన్ డియోల్ కండ్లుచెదిరే క్యాచ్ సహా మైదానంలో అమ్మాయిల పాదరస కదలికలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫీల్డింగ్ మెరుగుదలకు క్రికెటర్లు సహా కెప్టెన్లు మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు అభరు శర్మ కృషిని ప్రశంసించారు. ఆస్ట్రేలియా పర్యటనకు అభరు శర్మ దూరం కావటం అమ్మాయిలను ఆశ్చర్యానికి గురి చేసినా.. వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచకప్ నేపథ్యంలో శర్మ సేవలను జూనియర్ క్రికెట్‌కు వాడుకోవాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మహిళల క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో చీఫ్ కోచ్ మాత్రమే రెగ్యులర్. మిగతా సిబ్బంది జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి రొటేషన్‌లో సేవలందిస్తారు.