Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ జావెలియన్ త్రో ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ : భారత సూపర్‌స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానానికి ఎగబాకాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ నం.2 జావెలియన్ త్రోయర్‌గా నిలిచాడు. టోక్యో ప్రదర్శనతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకిన నీరజ్ చోప్రా..కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ ఆరంభానికి ముందు (జూన్) 16వ స్థానంలో కొనసాగిన నీరజ్ చోప్రా.. 1315 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జర్మనీ స్టార్ జొహనస్ వెట్టర్ (1396) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్లు టాప్-5లోకి చేరుకున్నారు. 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరిన నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి అథ్లెటిక్స్ పసిడి పతకం సాధించిపెట్టాడు. అగ్రస్థానంలో ఉన్న వెట్టర్తో చోప్రా 81 పాయింట్ల వెనుకంజలోనే నిలిచాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వెట్టర్, చోప్రాలు మరోసారి పసిడి కోసం పోటీపడనుండగా.. నీరజ్ చోప్రా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణంపై కన్నేశాడు.