Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్, ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చాంద్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 28ఏళ్ల చాంద్ ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ లేఖను శుక్రవారం బిసిసిఐకు పంపాడు. కొన్నేళ్లుగా టీమిండియాలో చోటు దక్కకపోవడం, యువతకు అవకాశమివ్వాలనే ఉద్దేశ్యంతోపాటు బిసిసిఐ అందించిన మధురమైన జ్ఞాపకాలతోనే క్రికెట్‌ను వీడుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం అమెరికాలో వ్యాపారరంగంలో స్థిరపడ్డ చాంద్ సారథ్యంలో భారత్ 2012లో అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను నెగ్గింది. ఇక 67ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 3,379పరుగులు, లిస్ట్-ఏ 150మ్యాచుల్లో 4,505 పరుగులతోపాటు 77 టి20ల్లో 1,565 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున 2011-13 సీజన్లలో ఆడాడు.