Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15మంది ఆటగాళ్లు, 8మంది అధికారులు
- 10కల్లా జాబితా వెల్లడించాలి: ఐసీసీి
కరాచీ: యుఏఇ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు 15మంది ఆటగాళ్లు, 8మంది అధికారుల ఖర్చులనే భరిస్తామని అంతర్జాతీయ క్రికెట్కమిటీ(ఐసీసీ) ప్రకటించింది. బయో బబుల్, కరోనా దృష్ట్యా 15 మందికంటే అదనంగా పంపే ఆటగాళ్ల ఖర్చులను ఆయా బోర్డులే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 10కల్లా అన్ని జట్లు 15మంది ఆటగాళ్ల జాబితాను వెల్లడించాలని, కోచ్, సహాయ సిబ్బందిని కలుపుకొనే ఎనిమిదిమంది అధికారులు ఉండాలని తెలిపింది. అక్టోబర్ 17నుంచి నవంబర్ 14వరకు యుఏఇలోని దుబారు, షార్జా, అబుదాబిల్లో మెగా టోర్నీ సంగ్రామం జరగనుందని, ఓమన్‌లోని మూడు వేదికల్లో అర్హత టోర్నీ పోటీలు జరగనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఆటగాళ్లను మార్పు చేయాలని ఆయా బోర్డులు భావిస్తే టోర్నీ ప్రారంభానికి ఐదు రోజుల తెలియజేయాల్సి ఉంటుందని, ఆటగాళ్లకు క్వారంటైన్ తప్పని సరి అని పేర్కొంది. భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్ టోర్నీని బీసీసీఐ కరోనా నేపథ్యంలో యుఏఇకి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.