Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా 364ఆలౌట్
- ఆండర్సన్‌కు ఐదు వికెట్లు
- బౌలింగ్‌లో మెరిసిన సిరాజ్
లండన్: లార్డ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండోరోజు ఆటలో సీమర్ల హవా కొనసాగింది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ ఆండర్సన్ ఐదు వికెట్లతో మెరవడంతో టీమిండియా 364 పరుగులకే పరిమితమైంది. అనంతరం హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ వరుసబంతుల్లో సిబ్లే, హమీద్‌లను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగుల స్కోర్‌తో శుక్రవారం ఆటను కొనసాగించిన భారత్.. లంచ్ విరామం అనంతరం నిలదొక్కుకొనేలా కనిపించినా.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను చేజార్చుకొంది. కేఎల్ రాహుల్ 129 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్‌లో సిబ్లేకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రహానే(1) నిరాశపరిచినా.. పంత్(37), జడేజా(40) ఫర్వాలేదనిపించారు. జట్టు స్కోర్ 362 పరుగుల వద్ద ఇషాంత్ ఔటైన తర్వాత 2 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లను టీమిండియా చేజార్చుకుంది. దీంతో టీమిండియా 364 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్‌కు ఐదు, రాబిన్సన్, మార్క్ ఉడ్కు రెండేసి వికెట్లు లభించాయి.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి)ఆండర్సన్ 83, కేఎల్ రాహుల్ (సి)సిబ్లే (బి)రాబిన్సన్ 129, పుజరా (సి)బెయిర్‌స్టో (బి)ఆండర్సన్ 9, కోహ్లి (సి)రూట్ (బి)రాబిన్సన్ 42, రహానే (సి)రూట్ (బి)ఆండర్సన్ 1, పంత్ (సి)బట్లర్ (బి)వుడ్ 37, జడేజా (సి)ఆండర్సన్ (బి)వుడ్ 40, షమీ (సి)బర్న్స్ (బి)మొయిన్ 0, ఇషాంత్ (ఎల్బి)ఆండర్సన్ 8, బుమ్రా (సి)బట్లర్ (బి)ఆండర్సన్ 0, సిరాజ్ (నాటౌట్) 0, అదనం 15. (126.1 ఓవర్లలో ఆలౌట్) 364పరుగులు.
వికెట్ల పతనం: 1/126, 2/150, 3/267, 4/278, 5/282, 6/331, 7/336, 8/362, 9/364, 10/364
బౌలింగ్: ఆండర్సన్ 29-7-62-5, రాబిన్సన్ 33-10-73-2, కర్రన్ 22-2-72-0, వుడ్ 24.1-2-91-2, మొయిన్ అలీ 18-1-53-1.