Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ మహిళల టీమ్ విజేత
వోక్లావ్(పోలెండ్): పోలెండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ స్వర్ణపతకాన్ని భారత మహిళల జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 228-216పాయింట్ల తేడాతో టర్కీని చిత్తుచేసి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. పర్మీత్ కౌర్, ప్రియ గుజ్రాల్, రిధి వర్షిణిలతో కూడిన భారత మహిళా బృందం తొలినుంచి టర్కీపై పైచేయి సాధించింది. ఇక జూనియర్(అండర్-18) కాంపౌండ్ ఆర్చరీ మహిళల మిక్స్డ్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో భారత యువ ఆర్చర్లు ప్రపంచ రికార్డును నమోదు చేశారు. వ్యక్తిగత విభాగంలో ప్రియ 696పాయింట్ల స్కోర్‌ను చేయగా.. పర్నీత్ కౌర్, రిథూ సెంతికుమార్ 2067/2160పాయింట్లు సాధించి 22పాయింట్ల వ్యత్యాసంతో ప్రపంచ రికార్డును నమోదు చేశారు. దీంతో అమెరికా పేర ఉన్న 2045/2160పాయింట్ల రికార్డు బ్రేక్ అయ్యింది.