Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాష్ట్రపతి భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్వపడుతోందని, గత ఒలింపిక్స్‌తో పోల్చిచూస్తే ఈసారి మన అథ్లెట్లందరూ అత్యుత్తమ ప్రదర్శన చూపారని కొనియాడారు. ఈ ఒలింపిక్స్‌కు అత్యధికమంది అథ్లెట్లు అర్హత సాధించి చరిత్ర సృష్టించారని, అలాగే ఏ ఒలింపిక్స్‌లోనూ దక్కనన్ని పతకాలు ఈసారి దక్కాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ ఒలింపిక్స్ జరిగాయని, అయినా కుటుంబ సభ్యులు సహకారం మరువలేనిదన్నారు. చాలామంది అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారేనని, అలాగే కోచ్, సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇన్ని పతకాలు దక్కాయన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.