Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియాన్ స్విమ్మింగ్ అకాడమీలో ఫ్రీడమ్ మారథాన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం బౌరంపేటలోని జియాన్ అకాడమీలో జరిగిన ఈ మారథాన్‌ను శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రిత్విక్ రెడ్డి, సాయి నిహార్ వంటి జాతీయ స్విమ్మర్లను తయారు చేస్తున్న జియాన్ అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ జాన్ సిద్ధిఖీని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి తప్పకుండా మన స్విమ్మర్లు ఇద్దరు.. ముగ్గురైన ప్రాతినిథ్యం వహించాలని.. అందుకు తగ్గట్టు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ బాటలు వేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ వేదికగా అంతర్ రాష్ట్ర, జాతీయ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇక, ఈ 15 కిలోమీటర్ల మారథాన్‌ను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గోల్డ్ మెడలిస్ట్.. తెలంగాణ యువ స్విమ్మర్ సాయి నిహార్ 3 గంటల 36 నిమిషాల్లో ముగించి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి ఈతగాడిగా రికార్డు సష్టించాడు. 100 మీటర్ల ట్రాక్‌లో 150 లాప్లు ఈది 15 కి.మీ మారథానను సాయి పూర్తి చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామకష్ణ, కోశాధికారి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.