Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌లో మిస్టర్ కూల్ క్రేజ్ మాములుగా ఉండదన్నస సంగతి తెలిసిందే. ధోనీపై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు వినూత్నంగా.. అందర్నీ అశ్చర్యపర్చేలా చూపిస్తుంటారు. తాజాగా ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ధోనీని కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హర్యానాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజరు గిల్ (18) అనే అభిమాని 1400 కిలో మీటర్లు నడిచి జార్ఖండ్‌లోని రాంచీకి చేరుకున్నాడు. జులై 29న పయనమైన అజరు 17 రోజుల పాటు నడిచి ధోనీ స్వస్థలమైన రాంచీకి చేరుకున్నాడు. ఇంత సాహసం చేసినా.. ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. గిల్ రాంచీకి చేరుకునే రెండు రోజుల ముందే ఐపీఎల్ కోసం ధోనీ దుబారుకి పయనమయ్యాడు. అయినప్పటికీ తన ఫేవరేట్ తిరిగొచ్చేవరకు ఇక్కడే ఎదురుచూస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు. మహీని కలిసిన తర్వాతే తిరిగి వెళ్తానని చెప్పాడు.