Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లార్డ్స్ : భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగేలా కనిపిస్తోంది. మొదటి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చూపగా, మూడో రోజు ఇంగ్లండ్ టీమ్ బ్యాటింగ్లో జోరు సాగించింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఇద్దరిని మార్క్ వుడ్ ఔట్ చేశాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్నట్టు కనిపించినా 20 పరుగులకే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసినా కీలక సమయంలో ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో మళ్లీ నిరాశపరిచాడు. దీంతో 53 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి భారత్ 120/3 పరుగులతో ఆడుతుంది. క్రీజులో పుజారా (36 పరుగులు)తో రహనే 32 పరుగులుతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరు చేసే పరుగులను బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
కోహ్లీ జెండావిష్కరణ
ఆదివారం లండన్లో టీమిండియా జట్టు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా తాము బస చేస్తున్న హోటల్ ముందు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రిటీష్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రితోపాటు మిగిలిన జట్టు కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ ట్విట్టర్లో పంచుకుంది. శ్రీలంక టూర్నుంచి ఇంగ్లండ్ చేరుకున్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా కూడా ఈ వీడియోలో కనిపించారు. ఐసోలేషన్ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరు 25 నుంచి జరిగే 3వ టెస్టు మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్నారు.
స్కోర్ బోర్డు : కెఎల్ రాహుల్ (సి)బట్లర్,(బి) మార్క్ వుడ్ 5, రోహిత్ శర్మ (సి)మొయిన్ ఆలీ (బి) మార్క్ వుడ్ 21, విరాట్ కోహ్లీ (సి) బట్లర్ (బి)కర్రన్ 20, పుజారా బ్యాటింగ్ 36, రహనే బ్యాటింగ్ 32 ఎక్షట్రాలు 6, మొత్తం 20/3